epaper
Thursday, January 15, 2026
epaper

మెస్సీ మేనియా

మెస్సీ మేనియా

రేపు రేవంత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌

రా­త్రి 7 నుం­చి 8 వరకు ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో ..

హైద‌రాబాద్‌లో సంద‌డిచేయ‌నున్న ఇంట‌ర్నేష‌నల్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం

రాజ‌ధానిలో ప‌లుచోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు

2,500 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాల‌తో నిఘా

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మెస్సీ మేనియా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రేపు (శ‌నివారం) రాజ‌ధానికి వస్తున్నారు. రా­త్రి 7 నుం­చి 9 వరకు ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో సీఎం రేవంత్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు. తొ­లుత సె­ల­బ్రి­టీ­ల­తో ఎగ్జి­బి­ష­న్‌ మ్యా­చ్‌ ని­ర్వ­హి­స్తా­రు. ఒక జట్టు­కు రే­వం­త్‌­రె­డ్డి.. మరో జట్టు­కు మె­స్సీ సా­ర­థ్యం వహి­స్తా­రు. అనం­త­రం యువ ప్ర­తి­భా­వం­తు­ల­తో మె­స్సీ మా­స్ట­ర్‌ క్లా­స్‌ కా­ర్య­క్ర­మం ఉం­టుం­ది. ఆ తర్వాత పె­నా­ల్టీ షూ­టౌ­ట్‌ ని­ర్వ­హి­స్తా­రు. చివరగా మ్యూజి­క­ల్‌ కా­న్స­ర్ట్‌ జరు­గు­తుం­ది.
హైదరాబాద్ న‌గరంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పర్యటన వేళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ద‌గ్గ‌జ క్రీడాకారుడు లియోనల్​మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో కలిసి మ్యాచ్ ఆడనుండటం ఈ పర్యటనలోనే హైలైట్‌గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాల‌తో గ‌ట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉప్పల్​స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షించారు. పోలీసులకు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఫ‌ల‌క్‌నుమాలో బ‌స‌

23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్ప‌ల్ స్టేడియంను భద్రతా అవసరాల రీత్యా నాలుగు సెక్టార్లుగా విభజించారు. 39 వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ ​విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్​స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు హాజ‌రుకానున్నారు. ఒక్క ఉప్పల్​స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2, 500 మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వ‌లంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్ ​విమానాశ్రయం నుంచి ఫలక్​నుమా ప్యాలెస్​, ఉప్పల్​స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. 13 తేదీ రాత్రికి ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ బస చేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

పాస్‌లు ఉంటేనే అనుమ‌తి

ఉప్ప‌ల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు టికెట్​లు, పాస్​లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా మెస్సీ సాకర్‌ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలనుకునే వారు రూ.10 లక్షలు చెల్లించి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం 100 ప్రత్యేకమైన స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే సాకర్‌ మ్యాచ్‌లో సహచర ప్లేయర్లు రోడ్రిగో డీ పాల్‌, లుయిస్‌ సురెజ్‌తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. 20 నిమిషాలు జరిగే ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్‌-9 టీమ్‌, మెస్సీ ఆల్‌స్టార్స్‌ తలపడనున్నాయి. షూటౌట్‌ సెగ్మెంట్‌లో పిల్లలకు మెస్సీ మెళకువలు నేర్పించనున్నాడు. ఉప్పల్‌ స్టేడియంలో మ్యూజికల్‌ కన్సర్ట్‌ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేసే మెస్సీ.. ఆదివారం ముంబైకి బయల్దేరి వెళ్లనున్నాడు.

మెస్సీకి జెడ్ కేటగిరి భద్రత : రాచకొండ సీపీ సుధీర్ బాబు

సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని… ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 2500 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రతా విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img