epaper
Thursday, January 15, 2026
epaper

జన గణనకు రూ.11,718 కోట్లు

జన గణనకు రూ.11,718 కోట్లు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
2026-27లో దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వ‌హ‌ణ‌
పూర్తి డిజిటల్ పద్ధతిలో వివ‌రాల సేక‌ర‌ణ‌
వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం ​కేంద్ర కేబినెట్ రూ.11,718 కోట్ల బడ్జెట్​ను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ ఆనాడు కొవిడ్-19 మహమ్మారి విజృంభించడంతో జనాభా లెక్కల సేకరణను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తదుపరి జనగణన 2027లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. భారతదేశంలో 150 ఏళ్లకు పైగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ మన వద్ద ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దానికి కొనసాగింపుగా 2027 జనగణన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ జనగణన భారత్​లో 16వది అవుతుంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత అయితే 8వది అవుతుంది. ఈ జనగణనలో దేశంలోని మొత్తం జనాభా, గృహాలు, సౌకర్యాలు, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు లాంటి అనేక అంశాల డేటాను సేకరించనున్నారు. వార్డు, గ్రామం, పట్టణం స్థాయిల్లో ఈ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ఆధారంగా ఈ సెన్సెస్​-2027 జరగనుంది.

2 దశల్లో జనగణన

2025 జూన్​ 16న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, ఈ జనగణన మొత్తం 2 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ 2026 ఏప్రిల్​- సెప్టెంబర్​ మధ్య జరుగుతుంది. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని అనుసరించి 30 రోజుల వ్యవధిలో ఇది నిర్వహించబడుతుంది. ఈ దశలో హౌస్ లిస్టింగ్​, హౌస్ సెన్సెస్​ నిర్వహిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ దశలో జనాభా గణన చేస్తారు. అయితే లద్ధాఖ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ లాంటి మంచు ప్రాంతాల్లో, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి 2026 సెప్టెంబర్​లో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. భారత్​లో మొదటిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో జన గణన చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. మొబైల్ అప్లికేషన్స్​ (ఆండ్రాయిడ్​, ఐఓఎస్​) ద్వారా డేటాను సేకరించి, దానిని మేనేజ్​మెంట్​ అండ్ మానిటరింగ్ సిస్టమ్​పోర్టల్​ ద్వారా రియల్ టైమ్​లో పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకోవడం కోసం, హౌస్​లిస్టింగ్ కోసం ప్రత్యేక టూల్స్​ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img