ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలోనే
25ఏళ్లుగా ఆదరించిన గణపురం ప్రజలకు ధన్యవాదాలు
ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పటిలాగే పాలుపంచుకుంటా
మాజీ జడ్పీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్
కాకతీయ, గణపురం : ఓటమి చెందిన ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ జడ్పీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ నాకు 2235 ఓట్లు వేసి గెలుపు వరకు తీసుకువెళ్లిన ఓటర్లకు పేరుపేరునా ధన్యవాదాలని తెలిపారు. నైతికంగా నాదే విజయమని అన్నారు. ఐదు పర్యాయాలు సర్పంచుగా, మండల వైస్ ఎంపీపీ గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా 25 సంవత్సరాలు పనిచేశానన్న సంతృప్తి ఉందన్నారు. గణపురం గ్రామ ప్రజలు తన వెన్నంటే ఉండి తనకు ఇంత మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలని తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సేవ చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మార్క మొగిలి. మామిండ్ల మల్లేష్. మాదాసు రవి. మార్క కుమార్. షరీఫ్. సాయి. తాళ్లపల్లి ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.


