కాజీపేటకు కొత్త డీసీ
ప్రస్తుత డీసీ సొంత శాఖకు బదిలీ
కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థ కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా బిర్రు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ స్థానంలో కొనసాగిన డీసీ.. బదిలీ అయ్యారు. ఆయన తన సొంత శాఖ పంచాయతీరాజ్ విభాగానికే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ మేరకు సీడీఎంఏ నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


