కాకతీయ, నేషనల్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం వేళ విషాదం నెలకొంది. పశ్చిమబెంగాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం చెందారు. తెల్లవారుజామున 7.30గంటలకు యాత్రికులతో బీహార్ వెళ్తున్న బస్సు బర్ద్వాన్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 35 మందికి తీవ్ర గాయలైనట్లు తెలిపారు. గాయపడినవారికి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
మరణించినవారంతా బీహార్ లోని చంపారన్ జిల్లా మోతీహారికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. మరణించినవారిలో 8 మంది పురుషులు ఉండగా ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది యాత్రికులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆగస్టు 8వ తేదీన వారంతా యాత్రను ప్రారంభించి..ఝర్ఖండ్ లోని దేవ్ గడ్ ను సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


