దంపతుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి…
కాకతీయ,ఆత్మకూరు : హోటల్ నడుపుకుంటూ జీవనం కోనసాగిస్తున్న దంపతుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల క్రాస్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే నీరుకుల్ల గ్రామానికి చెందిన ఆర్షం రాజ్ కుమార్ దంపతులు గత సంవత్సరం నుండి నీరుకుల్ల క్రాస్ వద్ద జాతీయ రహదారి 163 పై హోటల్ నడుపుకుంటున్నారు. గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి హోటల్ దగ్గరకు వచ్చి సిగిరెట్లు తీసుకొని తాగుతుండగా ఇక్కడ తాగవద్దని రాజ్ కుమార్ వారి భార్య చెప్పడంతో ఎందుకు అమ్ముతున్నారని కర్రలతో తల పై కొట్టడంతో తలా పగిలింది అని మరియు ఫింగర్ స్టిక్ తో మొఖం పై కొట్టరని, ముక్కు పై బలంగా కొట్టారని బాధితుడు వెల్లడించాడు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు స్టేషన్ అధికారులు తెలిపారు. పట్టా పగలే జాతీయ రహదారి పై ఇలా జరుగుతుంటే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోరా అని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు..


