పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
కాకతీయ, కరీంనగర్ : గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు,2025 తొలి విడత పోలింగ్‌కు సంబంధించి చొప్పదండి మండలంలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. చొప్పదండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం తనిఖీ చేశారు.ఎన్నికల సిబ్బందితో మాట్లాడిన ఆమె, పోలింగ్ కేంద్రాలకు బయలుదేరే ముందు చెక్ లిస్ట్ ప్రకారం అన్ని ఎన్నికల సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఎన్నికల కమిషన్ నియమావళిని పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను ఖచ్చితంగా, పారదర్శకంగా పూర్తి చేయాలంటూ అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


