epaper
Monday, March 2, 2026
epaper

రేపే ప‌ల్లెపోరు

రేపే ప‌ల్లెపోరు
తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం
ఉమ్మ‌డి జిల్లాలో 555 జీపీలు.. 4952 వార్డుల‌కు ఎన్నిక‌లు
ఇప్పటికే 53 జీపీల్లో స‌ర్పంచ్‌లు ఏక‌గ్రీవం
ఉద‌యం 7 గంట‌ల నుంచి 1 గంట వ‌ర‌కు పోలింగ్‌
మ‌ధ్యాహ్నం 2నుంచి కౌంటింగ్‌… సాయంత్రానికి ఫ‌లితాలు
గ్రామాల‌కు చేరిన పోలింగ్ సిబ్బంది.. సామాగ్రి
ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైన అధికారులు.. పోలీసులు
డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్లు

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఓరుగల్లులో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియ‌డంతో గురువారం పల్లె పోరు జరగనుంది. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో కలెక్టర్లు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరంగల్, హనుమకొండ జనగామ జిల్లాల పరిధిలో వరంగల్ పోలీస్ కమిష‌న‌రేట్ పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్పీలు భద్రతపై దృష్టి పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బుధ‌వారం సాయంత్ర‌మే పోలింగ్ సామాగ్రితో సిబ్బంది ఆయా గ్రామాల‌కు చేరుకున్నారు. భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. మానుకోట జిల్లాలో భ‌ద్రతా ఏర్పాట్ల‌పై ఎస్పీ శ‌బ‌రీష్ స‌మీక్షించారు.

ఓటుకు రూ. 2వేలు.. ఇంటికో మందు బాటిల్‌

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియ‌డంతో 11న ఎన్నిక జరగనుంది. వరంగల్ 6 జిల్లాల నుంచి మొదటి విడతలో 555 జీపీలు ఉండగా 53 చోట్ల ఏకగ్రీవాలు కావడంతో మిగతా 502 చోట్ల సర్పంచ్ కోసం పోటీ జరగనుంది. 1749 మంది సై అంటే సై అంటున్నారు. ఇక మొదటి విడతలో 4, 952 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండ‌గా.. బరిలో 8676 మంది ఉన్నారు. 981 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడ‌న్న విషయంలో క్లారిటీ ఉంది. దీంతో పార్టీల పెద్ద లీడర్లు దీనిని సవాల్‌గా తీసుకోవడంతో చాలా జీపీల్లో ప్రలోభాలు జోరుగా కొనసాగుతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు, జనరల్ కోట రిజర్వేషన్లు ఉన్నచోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఓటుకు నోటు ఫార్ములా అమలు చేస్తున్నారు. దీంతో ఇంటికో క్వార్టర్ సీసాతో పాటు డిమాండ్ మేరకు ఓటుకు రూ. 2 వేల నుంచి 5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధికారుల‌కు కలెక్టర్ దిశానిర్దేశం

హనుమకొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కమలాపూర్‌లోని మోడల్ స్కూల్ లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ప‌రిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గ్రామ పంచాయతీల వారీగా రూట్స్ అలాట్ చేసి జోనల్ రూట్ ఆఫీసర్లు సమన్వయంతో ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమవుతుందని, అందుకు సిబ్బంది ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img