హెడ్ కానిస్టేబుల్ దేవేందర్‌కు శ్రద్ధాంజలి
కాకతీయ, కరీంనగర్ : గుండెపోటుతో మృతిచెందిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రోజు దేవేందర్ (53) పార్థివ దేహానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ బుధవారం నివాళులర్పించారు. తీగలగుట్టపల్లిలోని దేవేందర్ నివాసానికి చేరుకున్న సీపీ, పార్థివ దేహంపై పూలమాల అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. దేవేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, ఆర్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు కమీషనరేట్‌కి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా నివాళులర్పించారు


