డిసెంబర్ 31కల్లా పనులు పూర్తి చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కాకతీయ, వరంగల్ : ఈనెల చివరి కల్లా స్మార్ట్ సిటీకి చెందిన కల్వర్టు రోడ్డు పనులను పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా పరిధి లోని పద్మాక్షి రోడ్ శాయం పేట ప్రాంతంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులను కమిషనర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో భాగం గా చేపట్టిన కల్వర్టు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డిఈలు రాజ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


