చెత్త తరలింపులో జాప్యం చేయొద్దు
నగర మేయర్ గుండు సుధారాణి
సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్
కాకతీయ, వరంగల్ : ట్రాన్స్ ఫర్ స్టేషన్ నుండి చెత్తను తరలింపుచేయడంలో జాప్యం లేకుండా చూడాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పరిధి పోతననగర్ లో గల సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆటోల మరమ్మత్తులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని అట్టి పరిస్థితిని నివారించి వేగవంతంగా మరమత్తులు జరిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ లో స్వచ్ఛ ఆటోలు సమయ పాలన పాటించాలని ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని 2 క్యాంపాక్టర్ లు మరమత్తులకు గురైన నేపధ్యంలో నిపుణుల ద్వారా వెంటనే మరమత్తులు పూర్తి చేసి జాప్యాన్ని నివారింప జేసేలా చూడాలని అన్నారు. తడి పొడి చెత్తను వేరుగా సేకరించే ప్రక్రియ వేగవంతం అయ్యిందని ఈ క్రమంలో ఆటోలు అందుబాటులో ఉండడం తప్పనిసరని అందుకే మరమ్మత్తులను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఎంహెచ్ఓ డా. రాజేష్, సానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


