గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలు పరచడంలో విఫలమైందని, ఆ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామాలలో ఏనాడు జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందని ప్రజలు గమనించాలని అన్నారు. ఆత్మకూర్ సర్పంచ్ అభ్యర్థి పాపని రూప రవీందర్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రూప రవీందర్, ఆత్మకూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ కానుగంటి సంపత్, బీఆర్ఎస్ నాయకులు వంగల బుచ్చిరెడ్డి, పూజారి రాము, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నత్తి సుధాకర్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.


