కోత కుట్లు లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. సాంబశివరావు
కాకతీయ, గీసుగొండ : కోత–కుట్లు లేకుండానే పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తు న్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. సాంబశివరావు తెలిపారు. గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు…పురుషులకు చేసే వేసేక్టమీ శస్త్రచికిత్స పూర్తిగా సురక్షితమై, కేవలం రెండు నిమిషాల్లో ఎలాంటి కోత–కుట్లు లేకుండా జరిగిపోతుందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ వల్ల ఎలాంటి వైకల్యం రాదని, పురుషులు సాధారణ జీవితాన్ని యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపారు. గతంలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శస్త్రచికిత్స చేయించుకుని ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు.కుటుంబ నియంత్రణ లో పురుషుల పాత్ర అత్యంత ముఖ్యమైందని,భయపడ కుండా ముందుకు వచ్చి వేసేక్టమీ చేయించు కోవాలని ఆయన పిలుపు నిచ్చారు. శిబిరంలో 22 మంది పేరు నమోదు చేసుకోగా,డాక్టర్ కృష్ణారావు ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య అధికారులు ప్రకాష్, కొమురయ్య,కార్యక్రమ అధికారి విజయకుమార్, మండల వైద్యాధికారులు శౌర్య శరణ్య,అరుణ్ కుమార్,స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


