పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత గల పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సంగెo, గీసుగొండ జెడ్పిహెచ్ఎస్ లో జిల్లాలో రెండవ విడత లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం రోజున నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పీ.ఓ లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలు, మార్గ్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, ఎం పిఓలు, మాస్టర్ ట్రైనర్, పిఓ లు తదితరుల పాల్గొన్నారు.


