కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థినే గెలిపించండి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎలుక రాజుకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న యువకులను ముందుకు తేవడం కాలానుగుణమని, రేణికుంటను మరింత ముందుకు నడిపించేందుకు రాజును సర్పంచ్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేణికుంటలో ఇప్పటికే విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేస్తూ
ఓపెన్ బావి నిర్మాణానికి రూ.6 లక్షలు, స్కూల్ కాంపౌండ్ వాల్‌కు రూ.5.60 లక్షలు, వంటగది కోసం రూ.4 లక్షలు, హైస్కూల్ ప్రత్యేక మరమ్మతులకు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. చిన్నారుల కోసం రూ.50 వేల విలువైన క్రీడా సామగ్రి అందజేశామని చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి ఎలుక రాజుతో పాటు పార్టీ నాయకులు శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, తమ్మనవేణి రాములు యాదవ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బోయిని సంపత్ కుమార్, బోనాల కరుణాకర్, వార్డు అభ్యర్థులు తమ్మనవేణి స్వప్న, కుంబం లక్ష్మి, రాజమణి, బామండ్ల సంపత్, కవిత, సునీల్ రెడ్డి, ఎలుక మహేశ్, తిరుపతి, కుంబం అశోక్, ల్యాగల మల్లారెడ్డి, పోతుగంటి భారతి, పూదరి విజయ, బోయిని రేణుక, నరహరి గోపాల్ రెడ్డి, ఎలుక శ్రీధర్, కోడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


