తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్ విజయ్ దివస్ వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్ నేతల ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో, మాజీ మంత్రి,కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రధాన అతిథులుగా హాజరై తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గులాబీ రంగు గాలిబుడగలను ఆవిష్కరించారు. కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


