నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవు
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను
కాకతీయ,ఆత్మకూరు : ఉపాధి హామీ పథకం అమలులో నిబంధనలు పాటించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను అన్నారు. సోమవారం ఆత్మకూర్ మండల కేంద్రములో నిర్వహించిన ఇన్ హౌస్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆత్మకూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆత్మకూరు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు సంబంధించి 2024-2025 సంవత్సరానికి సంబంధించి జరిగిన 35,55,6591 రూపాయల ఉపాధి హామీ పనులకు, పి.ఆర్ ద్వారా చేపట్టిన 25,067463 రూపాయల ఉపాధి హామీ పనులకు, ఎం.ఓ ఎంబి కింద చేపట్టిన 8,26,805 రూపాయల పనులను సామాజిక తనిఖీ నిర్వహించడాం జరిగిందని తెలిపారు. ఎఫ్.ఏ లపై 3558, టి.ఏ లపై 2339, ఏఈ పిఆర్ పై 1250 మొత్తం 7147 రూపాయలు రికవరికి ఆదేశించినట్లు తెలుపుతూ,పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంసీఎన్ఆర్ఇజిఎస్ నిబంధన మేరకు పనులు చేపించడం జరిగిందని అన్నారు. లేబర్ బడ్జెట్ పూర్తి స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీలలో పనులు జరిగేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఏవివో నరసింహారెడ్డి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పుష్పలత ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ఏపీవో రాజిరెడ్డి డి టి సి శ్రీధర్ ఈసీ రాము ఎస్ టి యం అజయ్ ఎస్ఆర్పి రంజిత్ డిఆర్పీలు టిఏలు కార్యదర్శులు సీవోలు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


