ఎన్నిక కోడ్‌ను అందరు పాటించాలి
కాకతీయ, నడికూడ: ప్రజలందరు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి పాటించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దామెర పోలీసు వారితో కలిసి మండల పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామం లో వాహనాల తనిఖీ నిర్వహించి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి అందరూ సహకరించాలని, ఒకవేళ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్సై కొంక అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


