సాంబార్ గిన్నెలో పడి నాలుగేళ్ల బాలుడి మృతి
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లోని టీజీఎస్‌డబ్ల్యూ బాలికల పాఠశాలలో ఆదివారం సాయంత్రం జరిగిన దుర్ఘటన కుటుంబంలో శోకం మిగిల్చింది. వంటమనిషి మొగిలి మధుకర్ నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్ ఆడుకుంటూ వంటగదికి వెళ్లి, అక్కడ ఉంచిన మరిగే సాంబార్ గిన్నెలో ప్రమాదవశాత్తు జారి పడ్డాడు.తీవ్రంగా గాయాల పాలైన బాలుణ్ణి వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మోక్షిత్ తుదిశ్వాస విడిచాడు.సమాచారం అందుకున్న పోలీసులు తండ్రి మధుకర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.


