మెడలోని చైన్ని లాగేందుకు స్నాచర్ యత్నం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం శివనగర్ రామాలయం వెనుక ఉన్న వెంకట పద్మావతి అపార్ట్మెంట్ ముందు ఓ మహిళపై స్నాచర్ దాడికి ప్రయత్నించాడు. మహిళ చాకచక్యంగా అతడి బారి నుంచి తప్పించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సంఘటనపై బాధితురాలు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తూ దొంగను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.


