మిల్లర్ అశోక్‌పై కేసు నమోదు
పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించిన పోలీసులు
కాకతీయ, దామెర : అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేస్తున్నట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ బృందం దామెరలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లుపై దాడి చేసింది. దాడిలో దామెర మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జూలూరు అశోక్(49)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ సుమారు రూ.75,000లు స్వాధీనం చేసిన బియ్యం, నిందితుడిని టాస్క్ ఫోర్స్ బృందం దామెరా పోలీసులకు అప్పగించింది. దాడిని ఏసీపీ ఏ.మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్,ఏఎస్‌ఐ కే. సుధాకర్ పర్యవేక్షించారు.


