సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్
కొణిజర్ల ఎస్సై సూరజ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొణిజర్ల మండలంలోని సమస్యాత్మక గ్రామలైన రాజ్యతండ, అమ్మపాలెం గ్రామాల్లో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం స్థానిక గ్రామస్తులు, రాజకీయ నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తూ బైండోవర్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపారు. స్థానిక ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని, కాబట్టి ప్రతీ ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయ బ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియేగం చేసుకునేలా పోలీస్ శాఖ చేస్తున్న పటిష్టమైన చర్యలకు ప్రతిఒక్కరు సహకరించాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఘర్షణ వాతావరణం పూర్తిగా నిర్మూలించేలా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు.


