ఓరుగల్లు కోటను సందర్శించిన జడ్జి దంపతులు
నల్లరాతి శిల్పాలపై కుటుంబ సభ్యుల ప్రశంస
కాకతీయ, ఖిలా వరంగల్ : చారిత్రక వైభవంతో నిలిచిన ఓరుగల్లు కోటను వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పూజ కుటుంబ సభ్యలతో కలిసి సందర్శించారు. కోటలోని అద్భుత కళాఖండాలు, నల్లరాతి శిల్పాలను పరిశీలించారు. పర్యాటక శాఖ గైడ్ రవి యాదవ్ ఓరుగల్లు కోటకు సంబంధించిన అనేక విశేషాలు, శిల్ప సంపద, నిర్మాణ వైశిష్ట్యం, కాకతీయ రాజుల సామ్రాజ్య కీర్తిని వారికి వివరించారు.
కుటుంబ సభ్యులు తమతో తీసుకువెళ్లిన కెమెరాలలో శిల్ప సముదాయాలను బంధిస్తూ“ఇవి నిజంగా అద్భుతాలు… అపూర్వమైన కళ” అని ప్రశంసించారు. జడ్జ్ పూజ దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం కోట చుట్టూ ఉన్న శిల్ప సంపదను పరిశీలించారు.


