ప్రసన్నాంజనేయ స్వామికి అష్టోత్తర శత కలషాభిషేకం
కాకతీయ, కరీంనగర్ : భగత్ నగర్ హెలిపాడ్ గ్రౌండ్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అష్టోత్తర శత కలశాభిషేకం, ఆరాధన, అర్చన, శ్రీరామ,హనుమత్ హోమం నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి అపర్ణ సునీల్ రావు దంపతులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను అందించారు.ఈ వేడుకకు కాలనీ వాసులు, దేవాలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు.


