ఉర్సుగుట్టలో చిల్లర దొంగలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో దుండగులు కిరాణా షాప్‌ను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. సమాచారం ప్రకారం, స్థానిక వ్యాపారి నడుపుతున్న కిరాణా షాప్ షట్టర్‌కు ఉన్న తాళం ధ్వంసం చేసి దుండగులు లోపలికి ప్రవేశించారు. దొంగలు షాప్‌లోని సిగరెట్ డబ్బాలు, నగదు వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై బాధితుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తుండగా, దుండగుల కదలికలపై దర్యాప్తు జరుపుతున్నారు.


