గీసుగొండలో పోలీసుల కవాతు
కాకతీయ, గీసుగొండ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి గీసుగొండ పోలీసులు భారీ కవాతు నిర్వహించారు.సిఐ విశ్వేశ్వర్ నాయకత్వంలో పోలీసులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు,సున్నిత ప్రాంతాల్లో కవాతు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు.ఎన్నికల సమయంలో ఎటువంటి ఆకస్మిక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ పేర్కొన్నారు.ప్రజల్లో నమ్మకం పెంపొందించడం,అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, చట్ట వ్యవస్థను కాపాడడం లక్ష్యంగా కవాతును చేపట్టినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని అభ్యర్థు లకు,కార్యకర్తలకు,ప్రజలకు సూచించారు.


