గ్లోబల్ సమ్మిట్‌కు రండి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సుమ్మిట్ రావాలని ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కరీంనగర్‌లో అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణను 2040 నాటికి దేశంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల వృద్ధికి ఈ సమ్మిట్ మైలురాయిగా మారనుందని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రిజర్వేషన్లకు వ్యతిరేకమని భావించడం తప్పుడు అభిప్రాయమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందుకోసం జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో 50 శాతం పరిమితిని ఎత్తివేయేలా బలమైన ఉద్యమం సాగించాలని పిలుపునిచ్చారు.


