epaper
Monday, March 2, 2026
epaper

భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ ఇచ్చిన 6 స్పెషల్ గిఫ్ట్స్ ఇవే..!

భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ ఇచ్చిన 6 స్పెషల్ గిఫ్ట్స్ ఇవే..!
పుతిన్ భారత్ పర్యటన విజ‌య‌వంతం
రష్యా అధ్యక్షుడికి మోదీ ఆరు విలువైన కానుక‌లు
అస్సాం టీ నుంచి వెండి గుర్రం వరకు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఎప్పటిలాగే రాజకీయంగా కాకుండా.. ఈసారి సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంతో మరింత రంగులమయమైంది. రెండు రోజుల ద్వైపాక్షిక సమావేశాల్లో పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించిన అంశాల్లాగే… ఆయన అందించిన బహుమతులూ హైలైట్ అయ్యాయి. భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ 6 స్పెష‌ల్ గిఫ్ట్స్ అందించారు. ఇవి కేవ‌లం కానుక‌లే కాదు.. భారతదేశం అనే మహాసంపదను ప్రతిబింబించే వారసత్వ చిహ్నాలు. దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఈ అరుదైన వస్తువులేంటో ఒక‌సారి ప‌రిశీలిస్తే..

మోదీ స్వయంగా పుతిన్‌కు అందించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతి రష్యన్‌లో అనువాదించిన శ్రీమద్ భగవద్గీత. ఇది భారత సంప్రదాయాల పరమార్థాన్ని తెలిపే గ్రంథం. అర్జునుడి సందేహాల తీరుస్తూ, శ్రీకృష్ణుడు చెప్పిన జీవన సారాంశం. పుతిన్‌కు భారతీయ ఆత్మను పరిచయం చేసే ప్రత్యేక మార్గం అయ్యింది.

ప్రపంచ ప్రఖ్యాత రుచికి చిహ్నమైన అస్సాం బ్లాక్ టీను పుతిన్‌కు మోదీ కానుక‌గా ఇచ్చారు. బ్రహ్మపుత్ర మైదానాల్లో పుట్టిన ఈ టీ ప్రపంచంలోకే అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. 2007లో జిఐ ట్యాగ్ దక్కిన అస్సాం టీ… రుచితో, సువాసనతో, కాంతివంతమైన రంగుతో ప్రత్యేకతను సంతరించుకుంది. మోదీ అందించిన ఈ బహుమతి, భారత వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిఫలిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పైస్.. హిమాలయాల్లో వేలాడే కాష్మీరీ సాఫ్రన్. భారత స్వచ్ఛ సుగంధంగా పిల‌వ‌బ‌డే కాశ్మీర్ కుంకుమపువ్వును మోదీ పుతిన్‌కు అందజేశారు. చేతితో చెక్కిన వెండి గురాన్ని కూడా రష్యా అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. మహారాష్ట్ర లోహ శిల్పకారుల చేతుల్లో పుట్టిన ఈ సిల్వర్ హార్స్.. రెండు దేశాల మధ్య దౌత్య బంధం ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. ఈ బహుమతి సామర్థ్యం, శక్తి, స్థిరత్వానికి చిహ్నం.

పుతిన్ కు మోదీ అందించిన మ‌రో విలువైన కానుక ఆగ్రా పాలరాతి చదరంగం సెట్. ఆగ్రా నుండి తీసుకువచ్చిన ఈ మర్బుల్ చెస్ సెట్ పూర్తిగా హస్తకళతోనే తయారు చేసినది. తెల్లని పాలరాతి మీద కచ్చితత్వంతో తయారు చేసిన శిల్పాలు… భారత శిల్పకళ ఎంత నైపుణ్యంగా ఉంటుందో చూపిస్తాయి.

ముర్షిదాబాద్ వెండి టీ సెట్ ను సైతం భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ బ‌హుబ‌తిగా ఇచ్చారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఈ వెండి టీ సెట్ క్లిష్టమైన చెక్కడాలతో, సున్నితమైన డిజైన్లతో ప్రపంచమంతా ప్రసిద్ధి చెందిన కళ. సాంప్రదాయ టీ సంస్కృతిని, భారత అతిథి సత్కారాన్ని ప్రతిబింబించే అందమైన గిఫ్ట్ ఇది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img