ఆత్మకూరులో అయ్యప్ప మహా పడి పూజ
గురుస్వామి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నగర సంకీర్తనలు
కాకతీయ, ఆత్మకూరు : పంచలింగాల శివాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజను వేద పండితులు హరిహర క్షేత్రం ప్రధాన అర్చకులు అనంత పద్మనాభయ శర్మ,అర్చకులు వెంకటేశ్వర్లు శర్మ సంతోష్ శర్మ గురుస్వామి వేద మంత్రోత్సర్లతో నిర్వహించారు. శనివారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా పడిపూజ కార్యక్రమంలో పంచలింగాల శివాలయములో పంచ అమృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధారణ దీక్షాపరులు, శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి అయ్యప్ప మాలధారణ దీక్షాపరులు అయ్యప్ప స్వామితో నగర సంకీర్తన నిర్వహించారు. మహా పడిపూజలో వరంగల్ కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు అభిషేకం నిర్వహించారు. ఈ మహా పడిపూజలో ఆత్మకూరు మండలం తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అయ్యప్ప మాల ధారణ దీక్షాపరులు పడి పూజలో పాల్గొని అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్రీనివాస్ రెడ్డి, రేవూరి జయపాల్ రెడ్డి, కుక్కల చంద్రమోహన్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బయ్య పైడి కళ్యాణ్, బీజేపీ పరకాల నియోజకవర్గం కిసాన్ మోర్చా కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ పలకల మంజుల, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పాపని రవీందర్ తో పాటు గురు స్వాములు మాల ధారణ స్వాములు, ఆత్మకూర్ గ్రామస్థులు పాల్గొన్నారు.


