epaper
Thursday, January 15, 2026
epaper

సీఎం విహారయాత్ర సభ

సీఎం విహారయాత్ర సభ
ఎన్నికల‌కోడ్ ఉల్లంఘిస్తూ న‌ర్సంపేట‌లో ప‌ర్య‌ట‌న‌
గుర్తు లేకుండా జ‌రిగే ఎన్నిక‌ల్లో సీఎం ప్ర‌చారం
ఇంత దిగ‌జారి ప్ర‌చారం చేసిన ముఖ్య‌మంత్రి ఎవ‌రూ లేరు
రాష్ట్ర ప్ర‌భుత్వానికి తొత్తులా ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరు
న‌ర్సంపేట‌కు ఏం చేస్తార‌ని చెప్ప‌కుండా ముగిసిన సీఎం ప్ర‌సంగం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నర్సంపేటకు ఏమీ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదని, విహారయాత్ర సభ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హెలిపాడ్‌ ల్యాండింగ్ రాజుపేట ప్రాంతంలో ఎన్నికల కోడ్‌కి విరుద్ధమైనా, తాము ఏ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కానీ ప్రభుత్వం అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిందన్నారు. రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అడ్డ‌గోలుగా హామీలు గుమ్మ‌రించేందుకు సీఎం ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని అన్నారు. “ప్రజలు ఎదురు చూసింది అభివృద్ధి… కానీ నర్సంపేట కు వచ్చినది గాడిద గుడ్డే” అని మండిపడ్డారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయడం అవమానకరం అని వ్యాఖ్యానిస్తూ, “ఇలాంటి సీఎం మరెప్పుడూ చూడలేదు” అన్నారు. ప్రత్త్యక్ష ప్రచారం లేని ఎన్నికలు అని ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు

“ఎమ్మెల్యే హోదాలో ఉండి మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని పెద్ది ధ్వ‌జ‌మెత్తారు. రెండోసారి శంకుస్థాపన చేయడం విడ్డూరం. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నేను ఉన్నప్పుడు వచ్చినవి. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం తగదు” అని అన్నారు. నర్సంపేట రింగ్ రోడ్ ప్రణాళిక కూడా తానే ప్రతిపాదించానని, ప్రస్తుత ఎమ్మెల్యే క్రెడిట్‌ తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రింగ్ రోడ్‌కు రూ.5 కోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ యంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయిందని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయినా ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. “కేసీఆర్ ప్రభుత్వం కాలంలో పంటలకు నీరు, కరెంట్, రైతు బంధు, ధాన్యం కొనుగోలు— అన్నీ అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు రైతులు యూరియా కోసం కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభ పెట్టడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గత సీజన్‌లో 1260 కోట్లు రైతులకు బకాయిలుగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు. రేవంత్ రెడ్డి సభ మొత్తం “చీరెల మీదే కార్యక్రమం నడిచింది” అని విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రజలకు ఏ స్పష్టమైన హామీ కూడా ఎక్కడా కనిపించలేదని, ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, రైతులకు అండగా నిలబడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img