బీజేపీ సీనియర్ నాయకుల పై సస్పెన్షన్ వేటు..
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవు..
బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : పార్టీకి వ్యక్తిరేకంగా పని చేస్తే ఎంతటి వారికైనా సస్పెన్షన్ వేటు తప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బీజేపీ సీనియర్ నాయకులు వంగల బుచ్చిరెడ్డి,వంగల సమ్మిరెడ్డి,ఆత్మకూర్ మాజీ సర్పంచ్ పలకల మంజుల పై పార్టీ సపెన్షన్ వేటు వేస్తుందని తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ మండల కేంద్రంలో చలామణి అవుతున్న ముగ్గురు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అమ్ముడు పోయారని ఆరోపించారు.స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచినా ఓడిన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏ పార్టీతో మండలంలో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసారు. బిఆర్ఎస్ నాయకులు కావాలనే బీజేపీ పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవి ప్రజలు నమ్మవొద్దని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిననేపథ్యంలో వంగాల సమ్మిరెడ్డి, బుచ్చి రెడ్డి, పలకల మంజుల కు నేటి నుంచి బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని బీజేపీ పార్టీ జిల్లాలోని గ్రామాల్లో, వార్డుల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పగడాల కళిప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆత్మకూరు మండల పంచాయతీ ఎన్నికల ఇన్చార్జి సిరంగి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పైడి, రవి, కౌన్సిల్ సభ్యులు వేణు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


