కారులో రూ.4 కోట్ల హవాలా నగదు
పక్కా సమాచారంతో సీజ్ చేసిన పోలీసులు
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున హవాల డబ్బు పట్టుబడింది. హైదరాబాద్- విజయవాడ హైవేపై చిట్యాల పోలీసుల తనిఖీలో డబ్బును గుర్తించారు. హైవే పై తనిఖీలు చేస్తుండగా కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలర్ట్ అయిన పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా రూ. 4 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కారులో వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


