గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
కాకతీయ,నెల్లికుదురు : బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. స్థానిక ఎన్నికల పురస్కరించుకొని మండలంలోని నెల్లికుదురు సర్పంచి అభ్యర్థి పులి రామచంద్రు,శ్రీరామగిరి,ఆలేరు, వావిలాల,బోటి మీది తండా తదితర గ్రామాల అభ్యర్థుల గెలుపు కోసం శంకర్ నాయక్ శుక్రవారం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదన్నారు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో శ్మశాన వాటికలు,రైతు వేదికలు,పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త తరలించడానికి ట్రాక్టర్లను సమకూర్చిందన్నారు. అంతర్గత రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పరిపాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, మండల,ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


