ఘనంగా దత్త పౌర్ణమి యజ్ఞం
కాకతీయ, కరీంనగర్ : స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దత్త పౌర్ణమి యజ్ఞం శుక్రవారం ఘనంగా జరిగింది. కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, మాదాసు నర్సయ్య,లక్ష్మి, ప్రణయ్,నాగరాణి పాల్గొన్నారు. యజ్ఞాన్ని శ్రీ శంకర్ ఆర్యన్ నేతృత్వంలో నిర్వహించారు.యజ్ఞం హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం కలిగినదని, ఇది పూజ మాత్రమే కాక మానవ జీవితానికి ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలను అందిస్తుందని ప్రిన్సిపాల్ సముద్రాల రాజమౌళి తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుంద్, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాళ్ రావు, అప్పిడి వకులాదేవి తదితరులు పాల్గొన్నారు.


