కేసీఆర్ పోరాటం.. యువతకు ఆదర్శం
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు
కాకతీయ, హన్మకొండ : బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా బాలసముద్రంలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన 14 ఏళ్ల ఉద్యమ పోరాటం, 11 రోజుల ఆమరణ దీక్ష నేటి యువతకు తెలియాలి. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు, కేసీఆర్ నాయకత్వం, ప్రజల పోరాటం వల్లే వచ్చింది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రావడంలో విద్యార్థుల పోరాటం అత్యంత కీలకం. వారిని స్ఫూర్తిగా తీసుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రొఫెసర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. వారి పోరాట చరిత్రను నేటి తరానికి చేర వేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థి జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.


