హుజురాబాద్ ఎంఈఓ పై కమిషనర్ & డైరెక్టర్ కు ఫిర్యాదు
అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న హుజరాబాద్ ఎంఈఓ
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాధికారి
చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు
చదువు చెప్పకుండా జీతాలు పొందడం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టే
చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్
కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ గారికి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు అధికార దుర్వినియోగం జరిగింది మండల విద్యాధికారి తన అధికార దుర్వినియోగం చేశాడు విద్యార్థులకు పాఠాలు బోధించవలసిన ఉపాధ్యాయుడిని గడిచిన రెండు సంవత్సరాలుగా తన కార్యాలయ పనుల కోసం వినియోగించుకోవడం తప్పు అని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పాఠశాల కమిషనర్ అండ్ డైరెక్టర్ ను సంప్రదించి వారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన మండల విద్యాధికారి ని మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదని తెలిపారు ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఈ విషయమై ఎంత దూరమైనా వెళ్తాను అని అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని లోకాయుక్తను ఆశ్రయిస్తానని తెలిపారు.


