ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దు
కాకతీయ,నర్సింహులపేట : ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దని దంతాలపల్లి మండల కేంద్రంలోని “అక్షర హైస్కూల్”విద్యార్థులు శుక్రవారం వినూత్న ప్రచారం నిర్వహించారు.నర్సింహులపేట మండలంని పెద్దనాగారం గ్రామంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ఎన్నికల్లో నాయకులు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోకుండా నిజాయితీ,నిబద్ధత కలిగిన నాయకున్ని ఎన్నుకుంటే భవిషత్తు తరాలకు బంగారు బాట అవుతుందని అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.


