కాకతీయ, తెలంగాణ బ్యూరో: మైనర్ బాలికపై అత్యాచారంతోపాటు హత్యకు పాల్పడిన కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద ఉరిశిక్ష విధించింది కోర్టు. 2013లో నిందితుడు మోహమ్మీ ముకఱ్ణము, 12ఏళ్ల బాలిక నల్లగొండలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను హత్య చేసి డెడ్ బాడీని కాలువలో పడేశాడు.
దీనిపై వన్ టౌన్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గత పదేళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. నేడు పోక్సో కోర్టు ఇంచార్జీ న్యాయమూర్తి రోజారమణి తుదితీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడంతోపాటు రూ. 1.10లక్షల జరిమానాను విధించారు.


