ఓటు వేయండి..! షాంపు అట్టి తల స్నానం చేపిస్తా..
భద్రాద్రి జిల్లా ఓట్ల ప్రచారంలో ఓ వినూత్న ప్రోగ్రాం…
కాకతీయ,మణుగూరు/అశ్వాపురం: పదవి దక్కించుకోవడం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని మొరపెట్టుకుంటున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఓ వినూత్న ప్రోగ్రాం చోటు చేసుకుంది.అశ్వాపురం మండల ఓ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ 4వార్డు అభ్యర్థి భూక్య నరసింహ నాయక్ వినూత్న ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థి భూక్యా చందులాల్ గుర్తు కత్తెరతో పాటు తన గుర్తు గ్యాస్ పొయ్యి పై ఓటు వేయమని ఓటర్లను కోరారు.తమకు ఓటు వేస్తే షాంపు అట్టి తల స్నానం చేపిస్తా అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.అభ్యర్థి ఓ ఓటర్ కి తల స్నానం చేపిస్తున్న వీడియో భద్రాద్రి జిల్లాలో వైరల్ మారింది.


