ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలి
మల్లంపల్లి జీపీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం వేగం పెంచుకుంది. సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ శాంతినగర్ కాలనీలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బతోజు ద్రోణాచారి ఈ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించిన ఆయన, ప్రజలకు మంచి సమయం వచ్చింది అని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. మల్లంపల్లి గ్రామ అభివృద్ధికి చీదర సంతోష్ కట్టుబడి ఉంటాడని, గ్రామంలోని సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, హరినాథ్, శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్, చోటు, మురి రాజు యాదవ్,రేణిగుంట్ల సురేష్, ఇమ్మడి ప్రవీణ్, ఎండి పాషా దేవేందర్, సమ్మయ్య ,ప్రవీణ్ యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


