ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చాలి
ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య
కాకతీయ, నర్సింహులపేట : తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటం ఆగదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య గౌడ్ అన్నారు.గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసిన ఉద్యమ కారుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చలేదని,ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీమ సీనన్న ఆధ్వర్యంలో శ్రీకాంతచారి పాదయాత్ర చేస్తున్నారని మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న సమయంలో ఆపాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో ముఖ్య సలహాదారుడు బొమ్మగాని వెంకన్న,ఆకుతోట సాయికృష్ణ,బానోతు రమేష్,అంబరీష,నరసయ్య,గండి సతీష్,కోట వెంకటయ్య ఖజామియ,గండి సతీష్,కొండబత్తిని అనసూర్య తదితరులు ఉన్నారు.


