బద్దిపల్లిలో కాంగ్రెస్‌లో చేరికలు
వెలిచాల రాజేందర్‌రావు సమక్షంలో పార్టీలోకి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి తాండ్ర రాజశేఖర్‌తో పాటు పలువురు యువకులు గురువారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరారు. రాజేందర్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కాంగ్రెస్‌నే ప్రత్యామ్నాయమని, యువత ముందుకు వచ్చి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌పై నమ్మకంతో పార్టీలో చేరుతున్న రాజశేఖర్ మరియు యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని రాజేందర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.తాండ్ర రాజశేఖర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొస్తున్న అభివృద్ధిసంక్షేమ పథకాలతో ఆకర్షితుడై కాంగ్రెస్‌లో చేరానని, రాజేందర్‌రావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


