అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల విద్యార్థులకు ఎస్‌జీఎఫ్
కాకతీయ, కరీంనగర్ : క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ క్రీడలలో బాస్కెట్బాల్ ఒకటని, విద్యార్థుల్లో ఈ క్రీడపై అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయిలోనే వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వివిధ స్థాయిలో జరిగే క్రీడాపోటీలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ, అవసరమైన అన్ని వనరులు కల్పించి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు.ఇటీవలి కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు బి. సిద్ధార్థ (10వ తరగతి), ముక్తహసిని (9వ తరగతి) అసాధారణ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తూ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


