ప్రతీ ఇంటికి చేరుతున్న కేంద్ర సంక్షేమ పథకాలు
బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కీర్తిరెడ్డి
కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ల నుంచి బీజేపీలో చేరికలు
కాకతీయ, గణపురం : మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో గురువారం భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న సేవలపై విశ్వాసంతో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి కొత్తగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నిజమైన అభివృద్ధిని తీసుకురాగల శక్తి బీజేపీదేనని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దృడ సంకల్పం పార్టీలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం నిషిదర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మారెడ్డి పల్లెలో పార్టీ బలం నిరంతరంగా పెరుగుతుండటం ఆనందదాయకమని, కొత్తగా చేరిన ప్రతి ఒక్కరు పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసి అభివృద్ధి పట్ల కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు మనోహర్, అనిల్, రాజేష్ నరేష్ అజయ్ రాకేష్ అనిల్ శివ మనోహర్ వేణు అఖిల్ సంజయ్ అనిల్ శ్రీరామ్ నగేష్ సందీప్ మహేష్ రాజు నరేష్ తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాంబయ్య, బూత్ అధ్యక్షులు మేడిపల్లి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


