విద్యార్థులు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి
కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులు బ్యాంక్ ఖాత కల్గి ఉండాలని గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఇమాద్,బ్యాంక్ కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అవుతాపురం గ్రామ జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పియం శ్రీ ఫైనాన్సియల్ లీటరసిపై అవగాహనా కల్పించారు.ఈ రోజుల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, సైబర్ క్రైమ్ బారిన పడకుండా, అపరిచిత కాల్స్ కు స్పందించకూడదని,బ్యాంకు యొక్క క్రెడియన్షియల్స్ ఇతరులకు తెలియపరచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కళాధర్, ఉపాధ్యాయులు రమేష్ కుమార్,రవి,సింహాద్రి, మహబూబ్ అలీ, నర్సయ్య,సురేందర్,సమ్మయ్య, రామ తార తదితరులు పాల్గొన్నారు.


