జోరుగా సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత, 12వ వార్డు అభ్యర్థి కోయ్యల కృష్ణవేణి–రామకృష్ణ ప్రచారంలో వేగం పెంచారు. సతీమణి గెలుపుకోసం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఉంగరం గుర్తు, గౌను గుర్తులపై ప్రచారం చేస్తున్నారు. ఈసందర్భంగా డోర్ టు డోర్ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో 12వ వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చేరిక కావడం విశేషం. మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, టౌన్ అధ్యక్షుడు కాజా పాషా ఆధ్వర్యంలో మానసపల్లి 12వ వార్డులో కోమల్ల కృష్ణవేణి–రామకృష్ణ సమన్వయంతో పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రచారంలో కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఈ గ్రామానికి మా తాత గోపాల్ రావు, అనంతరం నా తండ్రి చక్రధర్ రావు సర్పంచులుగా పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అదే మార్గంలో నా సతీమణి శ్రీలత ప్రజాసేవలో నిమగ్నమై గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో కాజా పాషా, తుమ్మ మల్లారెడ్డి, కోనేరు నాగేష్, ఎండి వలీ బాబా, కర్ర రవీందర్, దన్నపనేని కిరణ్, గండేపల్లి నరసయ్యతో పాటు మానసపల్లి యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


