ఖబడ్దార్ రేవంత్ రెడ్డి
హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకునేది లేదు
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
హిందువుల ఓట్లతో గెలిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
బీజేపీ జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి
కాకతీయ, వరంగల్ సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ హిందూ దేవతలపై అనుచిత వాక్యాలు చేసి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతిసే విధంగా గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటనీ, హిందూ దేవుళ్లను, ఆచారాలను కించపరిస్తే సహించేది లేదనీ, హిందూ దేవీ, దేవతలపై, హిందూ సమాజంపై వ్యంగ్య భాషను వాడి అనుచిత వ్యాఖలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హిందూ ద్వేషాన్ని వెళ్లగక్కాడని మండిపడ్డారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతల జోలికి వస్తే ఉరికినేది లేదని, సీఎం హోదాలో ఉండి మందు, పెళ్లిళ్లతో దేవుళ్లను పొడుస్తారని తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని గంట రవికుమార్ డిమాండ్ చేశారు. అనంతరం బిజెపి జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి హిందువుల ఓట్లతో గెలిచి హిందూ దేవి దేవతలపై అంకిత వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ విద్వేషపూరిత వైఖరికి నిరసనగా నేడు వరంగల్ చౌరస్తా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందన్నారు. హిందూ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


