హైదరాబాద్ ధర్నాకు తరలిన హనుమకొండ జర్నలిస్టులు..
కాకతీయ, హనుమకొండ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ టీయూడబ్ల్యూజె (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా ధర్నాలో హనుమకొండ జిల్లా జర్నలిస్టులు బుధవారం భారీగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సుల ద్వారా బయలుదేరిన జర్నలిస్టులు, హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టుల ఐక్యత అభివృద్ధి చెందాలని నినాదాలు చేశారు. హనుమకొండ జిల్లా నుంచి పాల్గొన్న వారిలో టీయూడబ్ల్యూజె (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్, వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్, కంకనాల సంతోష్, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, రాష్ట్ర, జిల్లా నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి, నార్లగిరి యాదగిరి, డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్, సిహెచ్ సోమనర్సయ్య, ఎం. రాజేంద్ర ప్రసాద్, సాయిరాం, వలిశెట్టి సుధాకర్, కె. దుర్గా ప్రసాద్, ఎండి నయీం పాషా, శ్రీహరి రాజు, బి. విజయ్ రాజ్, యుగేందర్ తదితరులు ఉన్నారు.


