కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉద్యమకారుల ఘన నివాళులు
కాకతీయ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం సాధన వెనుక అమరుల త్యాగం మహోన్నతమైందని, మలిదశ ఉద్యమానికి శ్రీకాంతాచారి చేసిన త్యాగం యావత్ దేశాన్నే కదిలించిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ముందుకు రావాలని, అమరుల కుటుంబాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.కార్యక్రమంలో సబ్బెడ చంద్రకళ, గోగుల రాజిరెడ్డి, డా.మంద భాస్కర్ యాదవ్, తాడూరి శ్రీమన్, దామ సదయ్య, సిలివేరి సుధాకర్, బోర్ల ధనంజయ్, తీట్ల మల్లేశం, ములుగురి నర్సయ్య, చంటి నరసక్క, ఎండి ఖతిజ, గడ్డం లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.


