మేడారం గద్దెల ప్రాంగణ నిర్మాణాల్లో పొరపాట్లు జరుగొద్దు
ములుగు కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క- సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి నిర్మాణాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, మేడారం రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదివాసి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రాతి నిర్మాణాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని , రహదారి విస్తరణ పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్స్ రెలింగ్ పనులను మేడారం స్తూపం వద్ద సర్కిల్ సుందరీకరణ పనులను, పరిశీలించి జాతర సమీపిస్తున్న తరుణంలో ముందస్తు వనదేవతల సందర్శనార్థం మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా చూడాలని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్దేశించిన గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో , ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


